ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విమర్శలపై వైకాపా మండిపడింది. చంద్రబాబు హూందాతనం , సంస్కారం లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. భాష మార్చుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారని హితవు పలికారు. నవరత్నాలు బాగా అమలు చేస్తున్నారనే అక్కసుతో.. చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. డీజీపీని ఖబడ్దార్ అని చంద్రబాబు అనడం దారుణమని, పోలీసులు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారన్నారు. చంద్రబాబు హయాంలో మద్యంతో వేలకోట్లు దోచుకున్న నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. భాజపాతో స్నేహం కోసం ఆ పార్టీనేతల కాళ్లుపట్టుకుంటూ రాజకీయ వ్యభిచారానికి దిగజారుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఔట్ డేటెడ్, కొడుకు లోకేశ్ అన్ వ్యాలిడ్ రాజకీయ నేతలుగా మారారన్నారు. నెలలో రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యికోట్లు సీఎం జగన్ మిగిల్చితే దేవినేని ఉమా దోపిడీ జరిగిందని విమర్శలు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే సీఎం దిల్లీ పర్యటన చేస్తున్నారని వ్యక్తిగత ఏజెండా ఏమీ లేదని వివరించారు.
బాబు భాష మార్చుకో - ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి - navaratnalu
ముఖ్యమంత్రి జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి తప్పు పట్టారు. నవరత్నాలు చక్కగా అమలు చేస్తున్నారనే అక్కసుతో సహనాన్ని కోల్పోయి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. భాష మార్చుకోవాలని సూచించారు.
బాబు భాష మార్చుకో - ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
Last Updated : Oct 22, 2019, 11:26 PM IST