కరోనా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు విజయవాడ నలంద డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ఆధ్వర్యంలో ఎల్బీహెచ్ కాంప్లెక్స్ వద్ద 'కోవిద్ -19' అలెర్ట్ అనే శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కరోనాని అరికట్టేందుకు తయారు చేసిన ప్రత్యేక టీని స్థానికులకు అందజేసి, మాస్క్ ధరించే విధానాన్ని, చేతులు శుభ్రపరచు విధానాలను నేర్పించారు. ఇదే విధంగా పలు మండలాల్లో ఇటువంటి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామని అధ్యాపకులు తెలిపారు.
కరోనాపై విజయవాడలో అవగాహన కార్యక్రమం - Corona news
కృష్ణాజిల్లా విజయవాడలోని నలంద డీగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీహెచ్ కాంప్లెక్స్ వద్ద కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు మండలాల్లో ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేస్తామని యజామాన్యం తెలిపింది.
విజయవాడలో కరోనాపై అవగాహన కార్యక్రమం