దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... తితిదేలో ప్రవేశపెట్టిన ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలని రద్దు చెయ్యడంపట్ల తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు ఏవి రమణ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు తప్పని జగన్ ఒప్పుకున్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు.. అభినందిస్తున్నట్టు ట్విట్టర్ లో తెలిపారు. వీఐపి దర్శనాలు చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టారని వైకాపా నాయకులు ఇక కలరింగ్ ఇవ్వడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. శ్రీవారిసేవలో ఉండాల్సిన తితిదే ఛైర్మన్ కు తాడేపల్లి లో అదనపు సిబ్బందితో కార్యాలయం ఏర్పాటు ఎందుకో అర్థం కావడం లేదన్నారు.
''వైకాపా నాయకులు కలరింగ్ మానితే మంచిది'' - amaravati
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు, వైఖరిపై.. తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు రమణ ట్వీట్ చేశారు.
రమణ