ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ హైదరాబాద్‌లోని మహంకాళీ బోనాల ఉత్సవాల సందర్భంగా... విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున సారెను సమర్పించేందుకు పాలక మండలి సభ్యులు పయనమయ్యారు. పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయిలు, పట్టువస్త్రాలు అమ్మవారికి సారెగా తీసుకెళ్లారు. నేడు హైదరాబాద్‌లోని మహంకాళి అమ్మవారితో పాటు ఉమ్మడి దేవాలయాల్లో దుర్గగుడి తరఫున సారె అందజేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
దుర్గమ్మ ఆలయం నుంచి తెలంగాణ మహంకాళి అమ్మవారికి ఆషాఢ సారె - vijayawada temple latest news
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున... తెలంగాణలోని మహంకాళి అమ్మవారికి సారెను సమర్పించేందుకు పాలక మండలి సభ్యులు పయనమయ్యారు. బోనాల ఉత్సవాల సందర్భంగా సారెను సమర్పించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
దుర్గమ్మ ఆలయం నుంచి తెలంగాణ మహంకాళి అమ్మవారికి ఆషాడ సారే