ప్రయాణికులు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే గడువును ఎపీఎస్ఆర్టీసీ పెంచింది. ప్రయాణానికి 30 రోజులు ముందు టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని పునరుద్ధరించింది. శనివారం నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆర్టీసీ తెలిపింది.
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. టికెట్ అడ్వాన్స్ బుకింగ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 30 రోజుల ముందుగానే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు.
కరోనా కారణంగా మూడు నెలల క్రితం ముందస్తు టికెట్ రిజర్వేషన్ సమయాన్ని ఆర్టీసీ కుదించింది. 7 రోజులు ముందుగా మాత్రమే టికెట్ బుకింగ్ చేసుకునేలా మార్పులు చేసింది. ప్రస్తుతం సర్వీసులను పెంచడం.... బస్సుల్లో ప్రయాణాలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం మార్పులు చేసింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇవాళ్టీ నుంచి నెలముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.