'రెవెన్యూశాఖలో ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి'
ఏపీ రెవెన్యూశాఖలో ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేాయాలని ఏపీఆర్ఎస్ఏ ప్రభుత్వాన్ని కోరింది. రీ సర్వేకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపింది.
రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 1290 జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ అసిస్టెంట్లు, 1870 గ్రామ రెవెన్యూ అధికారులు, 4485 గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాలను ప్రత్యక్ష నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) రాష్ట్ర కార్యవర్గ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యోగాల భర్తీ ద్వారా ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు వీలవుతుందని అభిప్రాయపడింది. ఈ దిశగా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు కోరారు. రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా పలు సంఘానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని భూములను రీ సర్వే జరిపిస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.