న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడమేంటని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి మండిపడ్డారు. బహిరంగంగా మీడియాలో ఆ విషయాన్ని ప్రకటించడం చూస్తుంటే.. అవినీతి కేసుల్లో సాక్షులను ప్రభావితం చేసేలా ఉందన్నారు. వెంటనే జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ తరహా లేఖలు ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని స్పష్టం చేశారు.
'సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలి'
ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించడం దారుణమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి మండిపడ్డారు. సాక్షులను ప్రభావితం చేసేలా ఆయన చర్యలున్నాయని అన్నారు.
ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి
TAGGED:
tulasireddy