కృష్ణా జిల్లా ముసునూరు మండలం గొల్లపూడిలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే మండలంలోని గుళ్లపూడిలో ఓ వివాహిత మంగళవారం డెంగీ లక్షణాలతో చనిపోయింది. మరికొందరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు .పదుల సంఖ్యలో రోగులు ప్రైవేటు ఆసుపత్రుల బాట పట్టారు. వీరిలో ఎక్కువ మందికి ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందని వైద్యులు చెప్పారు. ఈ మేరకు వైద్య అధికారులు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గుళ్లపూడిలో ప్రబలిన విషజ్వరాలు - డెంగీ
కృష్ణా జిల్లా ముసునూరు మండలం గుళ్లపూడిలో విషజ్వరాలు ప్రబలాయి. డెంగీ లక్షణాలతో ఓ వివాహిత మరణించింది.
గొల్లపూడిలో ప్రబలిన విషజ్వరాలు