విజయవాడలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. పెనుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ గాలులతో హోర్డింగులు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. గాలి దుమారంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు ాఅల్లాడిపోతున్నారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా కురిచేడులో అత్యధికంగా 46.47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 7 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటి ఎండ తీవ్రత నమోదయ్యాయి. 41 మండలాల్లో 45 నుంచి 47 మధ్య, 279 మండలాల్లో 43 నుంచి 45 మధ్య, 157 మండలాల్లో 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) విడుదల చేసింది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా నమోదైన ఉష్ణోగ్రతలు
అనంతపురం జిల్లా:
అనంతపురం | 40.08 |
తాడిపత్రి | 42.24 |
తాడిమర్రి | 40.90 |
యాడికి | 42.24 |
చిత్తూరు జిల్లా:
తిరుపతి | 45 |
గంగాధర నెల్లూరు | 45 |
రేణిగుంట | 45 |
సత్యవేడు | 45 |
వరదయ్యపాలెం | 45 |
ఏర్పేడు | 45 |
తూర్పుగోదావరి జిల్లా:
కొత్తపేట | 45 |
రాయవరం | 43 |
మండపేట | 45 |
కపిలేశ్వరపురం | 45 |
కోరుకొండ | 45 |
కడియం | 45 |
రంగంపేట | 45.5 |
కూనవరం | 45 |
రాజమండ్రి | 45 |
గుంటూరు జిల్లా:
అమృతలూరు | 46 |
బాపట్ల | 45 |
చిలకలూరిపేట | 45 |
పెదనందిపాడు | 45 |
తాడికొండ | 45 |
ఈపూరు | 45 |
నాదెండ్ల | 46 |
క్రోసూరు | 45 |
పెదకూరపాడు | 46 |
తెనాలి | 45 |
అమరావతి | 45 |
రెంటచింతల | 45 |
కడప జిల్లా:
కడప | 42 |
పుల్లంపేట | 42 |
కమలాపురం | 42 |
ఓబులవారిపల్లె | 42 |
చిట్వేలు | 42 |
ఒంటిమిట్ట | 42 |
ముద్దనూరు | 42 |
జమ్మలమడుగు | 42 |
కృష్ణా జిల్లా:
విజయవాడ | 45 |
మొవ్వ | 42 |
నందిగామ | 45 |
పమిడిముక్కల | 46 |
పెదపారపూడి | 45 |
తిరువూరు | 45 |
ఇబ్రహీంపట్నం | 45 |
కంచికచర్ల | 45 |
పెనుగంచిప్రోలు | 45 |