అటవీ భూములపై గిరిజనులకు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పి.పుష్ప శ్రీవాణి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని చెప్పారు. ప్రతి ఆర్వోఎఫ్ఆర్ పట్టాను ఆధార్‌తో లింక్ చేయాలని.. గిరిజనులకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. వ్యవసాయం చేసుకునే గిరిజనులకు జీవనోపాధి కల్పించేలా ఉండాలని సీఎం జగన్ అన్నారు. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు.