ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీ సంక్షేమంపై తెదేపాను సవాల్ చేసే అర్హత వైకాపాకు లేదు' - అనగాని సత్యప్రసాద్ తాజా వార్తలు

బీసీ సంక్షేమంపై తెదేపాను సవాల్ చేసే అర్హత వైకాపా నేతలకు లేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. 15 నెలల్లో బీసీల అభ్యున్నతిపై చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. బలహీన వర్గాలను మరింత బలహీనపర్చడమే ధ్యేయంగా ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శించారు.

anagani satyaprasad criticises ycp government on bc issue
అనగాని సత్యప్రసాద్

By

Published : Aug 16, 2020, 4:47 PM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి ఘటనలో ఎస్సైపై ఏం చర్యలు చేపట్టారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. బీసీ సంక్షేమంపై తెదేపాను సవాల్ చేసే అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. 15 నెలల్లో బీసీల అభ్యున్నతిపై చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. బీసీ నేతల అక్రమ అరెస్టులు కక్ష సాధింపు చర్యలేనని స్పష్టం చేశారు. బలహీన వర్గాలను మరింత బలహీనపర్చడమే ధ్యేయంగా ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శించారు.

బీసీలకు గతంలో మంజూరైన రుణాలను రద్దు చేశారని, ఆదరణ పథకం రద్దు చేయడం అభివృద్ధి నిరోధకం కాదా అని నిలదీశారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో ద్రోహం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం రిజర్వేషన్ల రద్దుకు కుట్ర పన్నారని, బీసీ కార్పొరేషన్ నిధుల్ని మళ్లించడం బీసీల అభివృద్ధిని నిరోధించడమేనన్నారు. ప్రశ్నించిన బీసీ నాయకుల్ని అరెస్టు చేయిస్తున్నారని, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల అరెస్టులు కక్ష సాధింపులే అని అనగాని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details