ఓ పెద్దాయన అతి జాగ్రత్త 72 ఏళ్ల తన భార్యకు శాపంగా మారింది. 8 నెలలు చీకటి గదిలో గడపాల్సి వచ్చింది. కృష్ణా జిల్లాకు చెందిన గంగాధర్, బేబీ దంపతులు. గంగాధర్ నాగాయలంకలో వీఆర్వోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరికి సంతానం లేరు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చారు. గణేశ్‌నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏడాదిన్నర తర్వాత గంగాధర్‌కు ఏమనిపించిందో ఏమో.. భార్యపై అతిప్రేమతో ఎక్కడికి వెళ్లినా బేబమ్మను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లేవాడు.
భర్తమాట తప్పేది లేదు
ఓ రోజు బేబమ్మను ఇంట్లోనే ఉంచి తాళం వేసి సొంతూరు వెళ్లాడు. అద్దె డబ్బులు తీసుకొస్తానని చెప్పాడు. ఎనిమిది నెలలైనా తిరిగిరాలేదు. తాళం వేసిన ఇంట్లోనే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది బేబమ్మ. గదిలో విద్యుత్ లేదు. ఉన్న దుస్తులనే ఓపిక చేసుకొని ఉతుక్కొని వాడుకుంటోంది. ఆమె కష్టాలను చూడలేక ఇంటి యజమానురాలు శారదతోపాటు అదే ఇంట్లో అద్దెకున్న వాళ్లు కిటికిలో నుంచి ఆహారాన్ని అందిస్తున్నారు. తాళం పగలు గొడతామని, బయటికి రావాలని ఆమెను ఇంటి యజమానురాలు కోరేది. కానీ ఆమె మాత్రం భర్తమాట తప్పేది లేదని, తాను బయటకు రానని చెప్పేది.
వృద్ధాశ్రమానికి తరలింపు