కల్తీ వ్యాపారం - ప్రజలపై ప్రభావం... అంశంపై అఖిల భారత యువజన సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో.. విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాపారం రోజు రోజుకు పెరిగిపోతోందని కల్తీ వ్యాపారస్తులు విజయవాడను కేంద్రంగా చేసుకొని కల్తీ దందాకు తెర తీశారని కృష్ణా జిల్లా ఆహార భద్రతా అధికారి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ వాడుకునే మంచినీటి దగ్గరనుండి తినే కూరగాయలు, పండ్లు... ఇలా చాలా వాటిని అనేక రసాయనాల ద్వారా పండిస్తూ... కల్తి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. కల్తీ నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్రజా ఆరోగ్య సంరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యవ్వాలని పిలుపునిచ్చారు. ఏదైనా వస్తువు కొనేముందు దాని నాణ్యత పరిశీలించి కొనాలని ప్రజలను కోరారు.
అంతా కల్తీ మయం.. జాగ్రత్త వహిచండి! - all india food carporation meeting
కల్తీ...కల్తీ... ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువుందా అంటే ఆశ్చర్యపోవాల్సిందే... తినే పండు నుండి మెదలు ప్రతీదీ కల్తీ. అందుకే మనల్ని మనమే కాపాడుకోవాలంటున్నారు అఖిల భారత యువజన సమాఖ్య సంఘం..
అంతా కల్తీ మయం.. జాగ్రత్త వహిచండి మరీ...!