కృష్ణా జిల్లా నందిగామ జాతీయ రహదారిపై అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో డీజీపీ కారు బైక్ను ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలు కావటంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు కంచికచర్ల పట్టణానికి చెందిన కర్రీ నరసింహారావుగా గుర్తించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు రహదారి పక్కన గుంతలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అదనపు డీజీపీ సురక్షితం బయటపడ్డారు. వెంటనే మరో కారులో ఆయనను సెక్యూరిటీ సిబ్బంది తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కంచికచర్ల పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అడిషనల్ డీజీపీకి తప్పిన పెను ప్రమాదం - బైక్ను ఢీకొట్టిన అడిషనల్ డీజీపీ కారు
అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణం శివారులో డీజీపీ కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి.
అడిషనల్ డీజీపీకి తప్పిన ప్రమాదం