ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనిశా పని తీరుపై మొన్న సీఎం ఆగ్రహం... నేడు డీజీ బదిలీ

అనిశా చీఫ్ విశ్వజిత్​ బదిలీ అయ్యారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అవినీతి నిరోధక శాఖ పనితీరుపై ఇటీవల సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే ఇప్పుడు డీజీ బదిలీ కావడం చర్చనీయాంశమైంది.

acb Chief Vishwajit has been transferred
acb Chief Vishwajit has been transferred

By

Published : Jan 4, 2020, 6:43 PM IST

అవినీతి నిరోధక శాఖ డీజీ కుమార్‌ విశ్వజిత్​ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో రవాణాశాఖ కమిషనర్‌ పి.సీతారామాంజనేయులు నియామకమయ్యారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా సీతారామాంజనేయులుకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. రవాణాశాఖ కమిషనర్‌గా ఎం.టి.కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం ఆయన రవాణా, రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు.

సమీక్ష జరిగిన రెండు రోజులకే

అనిశా పనితీరుపై సీఎం జగన్ గురువారం సమీక్షించారు. రాష్ట్రంలో అవినీతి నిరోధక విభాగం (అనిశా) పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. లంచం తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి రావాలని.. అధికారులు, సిబ్బంది మరింత చురుగ్గా, క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. అనిశాలో పనిచేస్తున్న సిబ్బంది ఇకనైనా అలసత్వం వీడాలని హెచ్చరించారు. ఈ సమీక్ష జరిగిన రెండు రోజులకే అనిశా డీజీ బదిలీ కావడం గమనార్హం.

ఇదీ చదవండి:'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు'

ABOUT THE AUTHOR

...view details