అధికారులు అక్రమంగా నామినేషన్‌ను తిరస్కరించారని... తనకు న్యాయం చేయాలని సర్పంచ్‌గా పోటీ చేస్తోన్న ఓ పారిశుద్ద్య కార్మికురాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు సర్పంచ్ అభ్యర్థి మురపాక పద్మావతి నామినేషన్ దాఖలు చేయగా.. దాన్ని అధికారులు తిరస్కరించారు. అన్యాయంగా తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని ఎస్ఈసీకి ఆమె ఫిర్యాదు చేశారు.
ఎస్ఈసీకి పారిశుద్ధ్య కార్మికురాలు ఫిర్యాదు
సర్పంచిగా పోటీ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు సర్పంచ్ అభ్యర్థి మురపాక పద్మావతి నామినేషన్ దాఖలు చేయగా.. దాన్ని అధికారులు తిరస్కరించారు.
తాను కూలి పని చేసుకుంటుంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని వైకాపా నేతలు అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని ఎస్ఈసీలోని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. నామినేషన్ వేసినప్పటి నుంచి పోటీ నుంచి తప్పుకోవాలని వైకాపా నేతలు తనను హింసించారని ఫిర్యాదులో తెలిపారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టినా ఎవరూ పెట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నామినేషన్‌ను అనుమతించేలా ఆదేశించాలని ఎస్ఈసీకి పద్మావతి విన్నవించారు.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలపై ఫిర్యాదులకు 'ఈ వాచ్' యాప్