ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి - కృష్ణా జిల్లా తాజా వార్తలు

విజయవాడ శ్రీనగర్ కాలనీలో విషాదం నెలకొంది. కిందపడి ఉన్నకరెంట్ తీగలను పక్కకు తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన ఓ వాచ్​మెన్ ప్రాణాలు కోల్పోయాడు.

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి

By

Published : Jun 11, 2021, 5:17 AM IST

కృష్ణా జిల్లా విజయవాడ శ్రీనగర్ కాలనీలో విద్యుదాఘాతానికి గురై ఓ వాచ్​మెన్ మృతిచెందాడు. మద్దాలి సాయి లోకేశ్ అనే వ్యక్తి.. స్థానిక కాలనీలో నివాసముంటూ వాచ్​మెన్​గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఉంటున్న భవనం ముందు కిందపడి ఉన్న కరెంట్ తీగలను పక్కకు తప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్​కు గురై మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సత్యనారాయణ పురం పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details