కృష్ణా జిల్లా నూజివీడులో శ్రీ గంధం చెట్ల దొంగల ముఠా కలకలం సృష్టిస్తోంది. వీరి వ్యవహారం పోలీసులకు సవాలుగా మారింది. నూజివీడుకు చెందిన ప్రశాంత్ నగర్, క్రిష్ణ విలాస్, ఎంప్లాయిస్ కాలనీల్లోని ఇళ్ల ముందు ఉన్న శ్రీ గంధం చెట్లను దొంగలు నరికి చోరీ చేశారని బాధితులు వాపోయారు. పోలీసులను ఆశ్రయించారు.
సుమారు రూ. 5 లక్షల విలువ చేసే చెట్లను నరికి.. దొంగలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను జామర్లతో ఆపి రాత్రి ఒంటిగంట సమయంలో.. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకొని.. విచారణ చేస్తున్నామన్నారు.