G20 Workshop : భారత అధ్యక్షతన జి20 దేశాల ప్రతినిధుల రెండవ మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ లో భవిష్యత్తు నగరాల్లో ఫైనాన్సింగ్‌ను పెంపొందించే మార్గాలతో పాటు ఇతర ప్రాధాన్యతలపై చర్చలు జరిగాయి. రెండు రోజుల ప్రతినిధుల సదస్సుకు కొనసాగింపుగా 2023 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎజెండాలో చేర్చిన అంశాలపై ఆసియా అభివృద్ది బ్యాంక్ తో సంయుక్తంగా సామర్థ్య నిర్మాణ వర్క్‌షాప్‌ను నిర్వహించాయి. ఇందులో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫైనాన్సింగ్ అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను చర్చించారు. స్థానిక ప్రభుత్వాలకు సమ్మిళిత, స్థితిస్థాపకత, స్థిరమైన నగరాల కోసం పట్టణ మౌలిక సదుపాయాల ఆర్ధికసాయానికి అవసరమైన సామర్ధ్యాలపై పలు అంశాలను సూచించింది.
క్షేత్రస్థాయి పర్యటన... వర్క్‌షాప్ అనంతరం ప్రతినిధుల బృందం క్షేత్ర స్ధాయి పర్యటనకు వెళ్లింది. తొలిభాగంలో, సింగపూర్, దక్షిణ కొరియా, రష్యా, చైనా, యూరోపియన్ కమిషన్ పాటుగా, మన దేశానికి చెందిన నిపుణులు నగరాలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్‌ను పెంపొందించడానికి తాము అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను ప్రదర్శించారు. సింగపూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ అహ్ తువాన్ లోహ్, సింగపూర్ అభివృద్ది మోడల్ ను వివరించారు. డైనమిక్ అర్బన్ గవర్నెన్స్ సిస్టమ్స్‌తో సహా జీవించడం, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లానింగ్ అభివృద్ధి, వ్యర్థాలు, నీటి నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విద్యపై విశదీకరించారు.
సవాళ్లపై సందేశం.. దక్షిణ కొరియా ప్రతినిధి తమ అనుభవాన్ని వివరిస్తూ, పట్టణ అభివృద్ధి , ఫైనాన్సింగ్ సవాళ్లను ఎదుర్కొన్న తీరును వెల్లడించారు. సియోల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఇన్హీ కిమ్, సియోల్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి హుయ్ షిన్ సియోల్ నగరం ఎదుర్కొన్న నిర్దిష్ట సవాళ్లను అధిగమించిన తీరును తెలియజెప్పారు. చైనా, రష్యా, యూరోపియన్ కమీషన్, భారత్ ప్రతినిధులు పట్టణ మౌలిక సదుపాయాలకు ఫైనాన్సింగ్‌ను పెంచడానికి అనుసరించిన వివిధ చర్యలను ప్రస్తావించారు.
చర్చలు సక్సెస్.. రెండు రోజుల జి20 చర్చలు ఫలవంతంగా సాగాయని కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ అరోఖ్య రాజ్ అన్నారు. పట్టణాల అభివృద్ధికి అవసరమైన అన్ని వనరుల పైనా చర్చ జరిగిందన్నారు. జి 20 రెండు రోజులు సమావేశం వివరాలను చర్చల తీరును మీడియా సమావేశంలో వివరించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై విస్తృత స్థాయిలో చర్చలు చాలా ఫలవంతంగా జరిగాయన్నారు.ఇందులో ప్రైవేట్, ప్రభుత్వ, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల ప్రతినిధులు నిర్దిష్ట అనుభవాలను పంచుకున్నారని అన్ని వర్గాల ప్రజలకు పట్టణంలో సేవలు అందించేందుకు ఇందులో పలు ఉదాహరణలు పొందుపరచారాన్నరు. ఈ అంశాలపై రుషికేశ్ లో తదుపరి సమావేశం జరుగుతుందనీ సాల్మన్ ఆరొఖ్య రాజ్ చెప్పారు. జి 20 ప్రతినిధులకు దక్షిణ కొరియా సోల్ నగరం అభివృద్ధి అనుభవం ,సింగపూర్ లివబుల్ సిటీస్ అనే అంశంపై టౌన్ ప్లానింగ్ అనుసరణ పై అనుభవాలు. విశాఖ నగర అనుభవాలను పంచుకుంటారని చెప్పారు.
ఇవీ చదవండి :