తిరుమలలో ట్రాఫిక్ అదుపు చేయడమంటే.. కత్తిమీద సామే! అందుకే పోలీసులు కఠినంగా వ్వవహరించాలని పోలీసులు నిర్ణయించారు. తిరుమల కొండపై వాహనాలు నిలపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నిర్మూలించేందుకు... లేపాక్షీ వద్ద నిలిపిన రెండు తితిదే వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు. 335 రూపాయల వంతున జరిమానా వేసి, దేవస్థాన రవాణా విభాగానికి పంపించారు. తిరుమల కొండపై తితిదే వాహనాలకే పోలీసులు జరిమానా వేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు అందరికీ... తితిదే వాహనాలకు జరిమానా - తిరుపతి
తిరుమలలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశారు. తితిదే వాహనాలకు సైతం జరిమానా విధించారు. నిబంధనలు అందరికీ వర్తిస్తాయని నిరూపించారు.
తితిదే ట్రాఫిక్ పోలీసులు పంపించిన ఈ చలానా