ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. బెట్టింగ్‌రాయుళ్లు పందేలకు సిద్ధమయ్యారు. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది సభ్యులు దర్శిపేటలో రేకుల షెడ్డును బెట్టింగ్‌లకు అడ్డాగా మార్చుకున్నారు. ఆన్లైన్ యాప్‌లను వినియోగిస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారమందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 11 సెల్ఫోన్లు, ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్.. 11 మంది అరెస్టు
గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని దర్శిపేటలో బెట్టింగ్‌కు పాల్పడిన 11 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు
తొంట్ల సత్యనారాయణ అనే నిందితుడు.. కిరణ్ అనే వ్యక్తి ద్వారా క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన పరికరాలను తీసుకొని ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాకానీ బాజిబాబు అనే వ్యక్తికి 10 శాతం కమిషన్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితులను గాలించేందుకు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రమణ మూర్తి తెలిపారు.
ఇవీ చూడండి...