ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిఠాపురంలో ఉద్రిక్తంగా తెదేపా దళిత గర్జన.. పలువురు గృహనిర్బంధం

TDP Leaders House Arrest at Pithapuram: పిఠాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ఈరోజు తెదేపా దళిత గర్జనకు పిలుపునివ్వడంతో శుక్రవారం రాత్రి నుంచే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొంతమంది తప్పించుకుని పార్టీ కార్యాలయానికి చేరుకోగా.. పోలీసులు పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. పోలీసుల తీరుపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

పిఠాపురంలో తెదేపా దళిత గర్జన
tdp Dalit garjana at pithapuram

By

Published : Jun 4, 2022, 8:04 PM IST

TDP Dalitha Girjana at Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం చేపట్టిన దళిత గర్జనను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా అధికార ప్రతినిధి వర్మను గృహనిర్బంధం చేశారు. శుక్రవారం రాత్రి కాకినాడలో వర్మను ఆయన నివాసంలో హౌస్‌ అరెస్ట్ చేశారు. అయితే.. వర్మ తప్పించుకొని అక్కడినుంచి పిఠాపురం తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో వర్మ బయటకు రాకుండా కార్యాలయాకి తాళం వేశారు. పోలీసులు తీరుపై తెదేపా నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. చివరకు తాళం తీసినప్పటికీ పార్టీ నాయకుల్ని మాత్రం పోలీసులు నిర్బంధంలోనే ఉంచారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ.. శాంతియుత ర్యాలీలను అడ్డుకోవడం దారుణమన్నారు.

పిఠాపురంలో దళిత గర్జనకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నాయకులపైనా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. పిఠాపురం మండలం కుమారపురం వద్ద కాకినాడ మాజీ ఎమ్యెల్యే కొండబాబు, తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్. రాజును అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details