రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావటం బాధాకరమేనని పినిపే విశ్వరూప్ అన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి విశ్వరూప్.. ఆర్టీసీని కాపాడుకునేందుకు అనివార్యంగా ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఛార్జీలు తక్కువ అని వెల్లడించారు. డీజిల్ ధర తగ్గగానే సెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తిరుమలకు దశలవారీగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు.
"ప్రమాణం చేసిన వెంటనే ఛార్జీలు పెంచాల్సి రావడం బాధాకరమే. ఆర్టీసీని కాపాడుకునేందుకు అనివార్యంగా తీసుకున్న నిర్ణయమిది. తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో ఛార్జీలు తక్కువ. డీజిల్ ధర తగ్గగానే సెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. తిరుమలకు దశలవారీగా వంద ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతాం." -పినిపే విశ్వరూప్, రవాణా శాఖ మంత్రి