గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ఎమ్మెల్యే విడదల రజిని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో 4,821 డ్వాక్రా గ్రూపులకు రూ.4.50 కోట్లు జమ కాబోతున్నాయని తెలిపారు. ఇంత పెద్ద మొత్తం నిధులు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆడపడుచులు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల్లో ఇకపై వడ్డీ మినహాయింపు ఉంటుందని చెప్పారు. ప్రజలకు అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్మోహాన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
'వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం' ప్రారంభించిన ఎమ్మెల్యే
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూప్‌లకు రూ.4.50 కోట్లు జమ కాబోతున్నాయని ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు.
చిలకలూరిపేటలో 'వైఎస్సార్ సున్నా వడ్డీ' ప్రారంభించిన ఎమ్మెల్యే విడదల రజిని