గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు వద్ద పెదనందిపాడు బాపట్ల ప్రధాన రహదారిలో మూడు నెలల క్రితం భారీ గుంత పడింది. క్రమేపీ గుంత పెద్దదిగా మారింది. ఆదివారం వర్షం కురవడంతో ఆ గుంతలో నీరు చేరింది. గుంత ఉన్న విషయం తెలియక వాహనదారులు నేరుగా వెళ్లి ప్రమాదానికి గురి అవుతున్నారు. ఓ యువకుడు తనకెందుకులే అనుకుని వెళ్లలేదు. తన వంతు బాధ్యతగా వ్యవహరించాడు. గుంత వద్ద నీరు చేరడంతో వర్షంలో తడుస్తూనే వాహనాలను పక్కకు పంపించాడు.
అధికారులు మరిచారు.. కానీ ఆ యువకుడు బాధ్యత చూపాడు!
అక్కడ మూడు నెలల క్రితం పడిన గుంతకు అధికారులు మరమ్మతులు చేయలేదు. అసలు పట్టించుకున్న వారే లేరు. వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి. గుంతలో నీరు చేరి.. ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి.
అధికారులు మరిచారు.. కానీ ఆ యువకుడు బాధ్యత చూపాడు!
ప్రమాదం జరగకుండా ఆ యువకుడు తన బాధ్యతగా వ్యవహరించాడు. అయితే ఆర్అండ్బీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గుంత పడి నెలలు గడుస్తున్నా.. కనీసం పటిష్ట మరమ్మతులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిలో ఇలాంటి గుంతలు 5 నుంచి 6 వరకు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.