YCP Govt Vote Gambling: ఎన్నికల సంఘం నిబంధన 6 ప్రకారం ఇంటి నంబర్ల వరుస క్రమంలో ఓటర్ల జాబితా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నియమాన్ని పాటించడం లేదు. అంటే.. అర్హులైన ఓటర్లను జాబితాలోంచి తొలగిస్తూ.. అనర్హులను చేర్చుతున్నారని అర్థమవుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంలో ఇలాంటి ఉదంతంపై బందరు వాసి ఇమడాబత్తిని దిలీప్‌కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను చేర్పించే కార్యక్రమం, ఇతర పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియ ఇలాగే ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
YCP Fake Voter ID Cards: వైసీపీ కక్కుర్తికి పరాకాష్ట.. 16ఏళ్లకే ఓటరు గుర్తింపు కార్డు..!
TDP votes deletion in AP: సాధారణంగా వీధిలో ఇంటి నంబర్లు ఒక వరుసలో ఉంటాయి. కానీ ప్రస్తుత జాబితాలో చాలా వరకు డోర్ నంబరు ఒకటి తర్వాత 40 లేదా 50 ఉంటోంది. ఆ నంబరు గురించి 1వ నంబరు ఇంట్లో విచారణ చేస్తే.. తమకు తెలియదని చెబుతారు. దీంతో ఆ ఓట్లను తొలగించేస్తారు. ప్రస్తుతం ఇదే విధంగా రాష్ట్రంలో దొంగ ఓట్ల ఆపరేషన్ జరుగుతుంది. దిలీప్‌కుమార్ అనే వ్యక్తి మొదట ఓటర్ల జాబితాలో అవకతవకలపై 2022 డిసెంబరు 6న నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన ఆర్డీఓకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. మొత్తం 1,140 ఓట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేరోజు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రతిని అందించారు. దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2022 డిసెంబరు 8న ఓటర్ల జాబితా ముసాయిదా పూర్తయింది. కానీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తిరిగి ఆయన ఫిబ్రవరి 15న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Complaint on YCP Govt Vote Gambling: దిలీప్‌కుమార్ ఫిర్యాదుని రాష్ట్ర ఎన్నికల అధికారి కృష్ణా... కలెక్టర్‌కు ఎండార్సు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ రాజాబాబు, ఆర్డీఓ కిశోర్‌ను 2023 మార్చి 8న ఆదేశించారు. అభ్యంతరాలను బల్క్‌గా ఇవ్వడం వల్ల తాము ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోలేదంటూ దిలీప్‌కు లేఖ రాశారు. దీంతో ఆయన మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అతని ఫిర్యాదుకి అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.