గత ఆరు నెలల్లో రాష్ట్రంలో హింసాత్మక పాలనే సాగిందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలు, అభివృద్ధిని అడ్డుకోవడం మించి జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనపై '6 నెలల అరాచక పాలన' పేరిట యనమల పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు ఈ 6 నెలల్లో 4 శాతం వరకూ పడిపోయిందని వెల్లడించారు. ఆరు నెలలుగా హింసాత్మక పాలనే సాగిందని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు.
'గత ఆరు నెలల్లో రాష్ట్రంలో హింసాత్మక పాలన' - వైకాపా పాలనపై యనమల
వైకాపా ప్రభుత్వ పాలనపై '6 నెలల అరాచక పాలన' పేరిట తెదేపా సీనియర్ నేత యనమల పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు ఈ ఆరు నెలల్లో 4 శాతం వరకూ పడిపోయిందని వెల్లడించారు
వైకాపా పాలనపై యనమల పుస్తకం