సెప్టెంబర్ 1 నుంచి జరిగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. 6 రోజలు పాటు జరిగే పరీక్షల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా జిల్లాల సంబంధిత అధికారులను హెచ్చరించారు. పరీక్షల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు తాడేపల్లి లోని కార్యాలయంలో ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఇంటర్వూలు ఉంటాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సూచించారు. మెరిట్ , రిజర్వేషన్ ఆధారంగానే నియామకాలు జరుపుతామని స్పష్టం చేశారు.
''పకడ్బందీగా సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు'' - thadepally
గ్రామ వార్డు, సచివాలయ పరీక్షల నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద గుంటూరు జిల్లా తాడేపల్లిలో వర్క్ షాప్ నిర్వహించారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యల తీసుకుంటామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల ద్వివేది హెచ్చరించారు.
సచివాలయ పోస్టులపై అసత్య ప్రచారాలు నమ్మవ్దదు:ద్వివేది