రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి పదవిని ఇప్పించడానికే ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనకు వెళ్లారని తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం, ప్రత్యేకహోదాకు సంబంధిన అంశాలను మోదీ వద్ద ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టాలని చూడటం దారుణమన్నారు. కేసుల నుంచి బయటపడటానికే కేంద్రంతో లాలూచీ పడ్డారని విమర్శించారు.
'విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టాలని చూస్తున్నారు'
విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆరాటపడుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారని ఆక్షేపించారు.
తెదేపా నేత దేవినేని ఉమా