ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపద సమయంలో ఆసరా..నిరుపేదలకు సహాయం - lockdown

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ అమలులో ఉన్నందున పనులు లేక పస్తులుంటున్న నిరుపేదలకు తెదేపా నేతలు సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకువచ్చి పేదలను ఆదుకుంటున్నారు.

Vegetable distribution for free
ఆపద సమయంలో ఆసరా..నిరుపేదలకు సహాయం

By

Published : Apr 8, 2020, 12:35 PM IST

లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను ఆదుకోవటంతో వైఫల్యం చెందిందని తెదేపా కార్యకర్త కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. గుంటూరు శ్యామలనగర్ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిరుపేదల్ని ఆదుకోవటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రూ.5000 నగదు సాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వైకాపా నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని...అందుకే తెదేపా కార్యకర్తలు ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని వివరించారు.

ఇదీ చదవండి:

తిరుపతిలో ఉచితంగా కూరగాయల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details