గుంటూరు జిల్లా రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. అన్ని రకాల షాపులను మూసివేశారు. ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు రాకుండా ఇంటి వద్దకే సరుకులు అందించే ఏర్పాట్లు చేశారు. రెడ్ జోన్‌లోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు శానిటైజింగ్ చేశారు. ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు నియోజకవర్గంలో కొవిడ్ కేసుల సంఖ్య 18కి చేరాయి. వీరిలో నలుగురు కోలుకున్నారు.
రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో రెండు కరోనా కేసులు నమోదు - రేపల్లె తాజా కరోనావార్తలు
గుంటూరు జిల్లా రేపల్లె, నిజాంపట్నం మండలంలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించి ప్రజలు బయటకు రాకుండా నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే అందజేశారు.
రెండు కరోనా కేసులు నమోదు