Octopus force for CM Jagan's security: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కొత్త ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ఆయనకు ముప్పు ఉందంటూ పేర్కొంది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రానికి పంపిన నోట్లో ఈ అంశాలను పేర్కొన్నారు. ఆయనకు వామపక్ష తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, వ్యవస్థీకృత నేరముఠాల నుంచి ముప్పు ఉందని.. జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా ఈ నోట్లో స్పష్టం చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కొత్త ముప్పు ఉన్నట్టు ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్దారించాయి. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉందనీ పేర్కొంటూ
రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నోట్ పంపింది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో సీఎం భద్రతకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఈ సూచనలు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉందంటూ... రాష్ట్రప్రభుత్వం ఆ నోట్లో పేర్కొంది. ఇప్పటి వరకూ దేశంలోని ముఖ్యమంత్రుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాత్రమే ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.ముఖ్యమంత్రి జగన్‌కు వామపక్ష తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు, ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి భద్రత కల్పించాల్సి ఉందని కోరింది. వ్యవస్థీకృత నేర ముఠాల నుంచి కూడా ఆయనకు ముప్పు ఉందని స్పష్టం చేసింది.
ముకేశ్ అంబానీకి 'జెడ్ ప్లస్' సెక్యూరిటీ.. రక్షణగా 55 మంది..