ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల పహారాలో ప్రశాంతంగా ఆత్మకూరు

తెదేపా పిలుపుతో వార్తలోకెక్కిన ఆత్మకూరు గ్రామం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో పహారా కాస్తున్నారు.

ఆత్మకూరులో పోలీసులు

By

Published : Sep 14, 2019, 8:22 AM IST

పోలీసుల పహారాలో ప్రశాంతంగా ఆత్మకూరు

గుంటూరు జిల్లా ఆత్మకూరు గ్రామం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. గుంటూరులోని శిబిరం నుంచి బాధితులను గ్రామానికి తీసుకెళ్లిన తర్వాత పోలీసులు ఇరు వర్గాల వారితో మాట్లాడారు. ఇకపై గొడవలకు దిగబోమని ప్రమాణం చేయించారు. దాడులు, ప్రతిదాడుల కారణంగా గ్రామంలో ప్రశాంత వాతావరణం చెడిపోవటంతో పాటు ఇరు వర్గాల వారు నష్టపోతారని వారికి స్పష్టం చేశారు. గ్రామంలోకి కొత్తవారిని ఎవరు వచ్చినా తనిఖీ చేసి పంపిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు విధించారు. ఎస్సీ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఇపుడిపుడే గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. అలాగే వ్యవసాయ పనులకు వెళ్లడం ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details