ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబుకు భద్రతను తగ్గించలేదు: హోంమంత్రి - చంద్రబాబు భద్రత వార్తలు

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గించారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. ఆయనకు జెడ్​ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగుతోందని వెల్లడించారు.

home minister sucharitha
home minister sucharitha

By

Published : Feb 19, 2020, 8:10 PM IST

మీడియా సమావేశంలో హోంమంత్రి సుచరిత

తెదేపా అధినేత చంద్రబాబుకు భద్రతను తగ్గించలేదని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగుతోందని వెల్లడించారు. ఆయనకు ఉండవల్లిలో 135, హైదరాబాద్‌లో 48 మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. వీఐపీల భద్రతపై 6 నెలలకు ఒకసారి సమీక్ష జరుగుతుందన్న మంత్రి.. కేవలం 53 మంది మాత్రమే ఉన్నారని తెదేపా నేతలు అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. పీఎస్‌పై ఐటీ దాడుల గురించి కాకుండా భద్రతపై మాట్లాడటం సరికాదని మంత్రి సుచరిత పేర్కొన్నారు. మంగళగిరిలో సామూహిక అత్యాచార కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details