TDP spokesperson Kommareddy Pattabhiram: అప్పుల వేటలో “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” అని ప్రజలు గగ్గోలుపెడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. ఇప్పటిదాకా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై బుర్ర కథలు, పిట్టకథలు చెప్పిన బురిడీ బుగ్గన నేడు బఫూన్ బుగ్గనగా మారిపోయారని ఆయన ఆరోపించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 నాటికి దేశంలోనే అత్యధికంగా ఆర్బీఐ నుంచి రాష్ట్రం అప్పులు సేకరించిందని పట్టాభి గుర్తుచేశారు. అప్పులు తీసుకోవడానికి ఇతర రాష్ట్రాలకు లేని అవసరాలు ఏపీకి ఎందుకొస్తున్నాయని నిలదీశారు.
రాష్ట్రానికి “ఇదేం ఖర్మ” అనేలా చేస్తున్నారు: పట్టాభి - ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు
Pattabhiram on Idem Kharma : ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు 'ఇదేం ఖర్మ' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే.. ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లెక్కలతో సహా ప్రజల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మీడియాతో మాట్లాడుతూ “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” అనేవిధంగా.. ఆర్బీఐ నుంచి రాష్ట్రం అప్పులు సేకరించిందని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జార్ఖండ్, ఛత్తీస్ఘడ్, బిహార్, అసోం రాష్ట్రాల కంటే కూడా ఏపీ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బయటపెట్టిన ఆర్బీఐ లెక్కలకు బుగ్గన సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాలని.. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజల ఫిర్యాదులను నమోదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. అలా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్రపతి, గవర్నర్‌కు పంపుతామని.. పార్టీ వెల్లడించింది.
ఇవీ చదవండి: