'మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి' - guntur
రాష్ట్రంలో తెదేపా చేస్తున్న అభివృద్ధిని చూడలేకే వైకాపా విమర్శలు చేస్తోందన్న పోతుల సునీత.
spokes person
వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత జోస్యం చెప్పారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజమండ్రిలో జరిగిన జయహో బీసీ సభను చూసి వైకాపా నేతలకు భయం మొదలైందన్నారు. అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఎన్నికవుతారని అభిప్రాయపడ్డారు.