ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ హేట్స్ జగన్! వద్దనేందుకు సవాలక్ష కారణాలున్నాయన్న గంటా - 20 ప్రశ్నలతో బహిరంగ లేఖ

TDP MLA Ganta Srinivasa Rao Questions to CM Jagan: ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దో చెప్పడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్​కు 20 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

TDP_MLA_Ganta_Srinivasa_Rao_Questions_to_CM_Jagan
TDP_MLA_Ganta_Srinivasa_Rao_Questions_to_CM_Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 6:51 PM IST

TDP MLA Ganta Srinivasa Rao Questions to CM Jagan: నిన్నటిదాకా "మా నమ్మకం నువ్వే జగన్‌" అన్న రాష్ట్ర ప్రజలు ఇక ఇప్పుడు "నిన్ను నమ్మం జగన్‌" అని మొహం మీదే చెప్పేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. గడపగడపకూ వైసీపీ అన్నారని.. గడపగడపలో అవమానంతో వెనుదిరిగారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు "వై ఏపీ నీడ్స్‌ జగన్‌" (Why AP Needs Jagan) అనే కొత్త పల్లవి అందుకొన్నారని.. కానీ ప్రజలు మాత్రం 'ఏపీ హేట్స్‌ జగన్‌' అనే స్వరం అందుకున్నారని అన్నారు. వద్దు వద్దు ఈ జగన్.. మళ్లీ మా కొద్దు ఈ జగన్.. అనే నినాదంతో ప్రజలు ఉన్నారని, X (ట్విట్టర్) వేదికగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీఎం జగన్మోహన్ రెడ్డికి 20 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్రాన్ని మూర్ఖపు పాలనతో అధోగతిపాలు చేసి.. అగమ్యగోచరంలోకి నెట్టేసినందుకా ఈ రాష్ట్రానికి మీరు అవసరం అని ప్రశ్నించారు. నవ రత్నాలు నవమోసాలుగా చేసి.. ఏ ఒక్క రత్నాన్ని కూడా సక్రమంగా అమలు చేయనందుకా ఈ రాష్ట్రానికి మీరు అవసరం అని నిలదీశారు. ఈ 20 ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రులు కానీ, సలహాదారులు కానీ, సామంత రాజులు కానీ సమాధానం చెప్పగలరా అంటూ మండిపడ్డారు. వై ఏపీ నీడ్స్ జగన్.. దేనికోసమని గంటా ప్రశ్నించారు.

పుట్టపర్తి సభలోనూ అబద్దాలతో వల్లెవేసిన సీఎం జగన్-కేంద్ర సాయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ప్రభుత్వం

గంటా శ్రీనివాసరావు ప్రశ్నలు:

  • 1)రైతు భరోసా (Rythu Bharosa): 50వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి.. రూ.37,500కు కుదించారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలను రద్దు చేసి 2 లక్షల రూపాయలు నష్టం చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 2) అమ్మఒడి (Ammavodi): అమ్మఒడికి 13వేల రూపాయలు ఇచ్చి నాన్న బుడ్డీలో 70 వేల రూపాయలు కొట్టేస్తున్నారు. ఎంటీఎఫ్​, ఆర్​టీఎఫ్ స్కాలర్ షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలను రద్దు చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 3) పెన్షన్లు: చంద్రబాబు 18 వేల రూపాయలు పెంచగా, జగన్ రెడ్డి 750 రూపాయలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే 3 వేల రూపాయల పెన్షన్ హామీపై మాట తప్పారు. ప్రతి సంవత్సరం పెంపు హామీపై మడమ తిప్పినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 4) పేదలందరికీ ఇళ్లు: సెంటు పట్టా పేరుతో పేదలను అప్పుల పాలు చేశారు. భూమి కొనుగోలులో రూ. 7 వేల కోట్లు వైసీపీ నేతలు మింగేశారు. ఓటీఎస్ పేరుతో ఒక్కొక్కరి నుండి 10 వేల రూపాయలు నుంచి రూ.40 వేల చొప్పున బలవంతంగా వసూల్ చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 5) ఫీజు రీయింబర్స్మెంట్:చంద్రబాబు 16 లక్షల మందికి ఇచ్చారు. జగన్ రెడ్డి 7 లక్షల మందికి కోత కోసి 9 లక్షల మందికే ఇస్తున్నారు. చంద్రబాబు ఒకే విడతలో ఇస్తే.. జగన్ రెడ్డి నాలుగు విడతలతో మోసం చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?

Ammavodi not credited: ఇంకా జమ కాని 'అమ్మఒడి' నిధులు.. బ్యాంకుల వద్ద ఎండలో పడిగాపులు

  • 6) మద్య నిషేధం: 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మి పేదలను కొల్లగొట్టారు. లక్ష కోట్ల రూపాయలను కమిషన్లుగా దండుకున్నారు. మద్య నిషేధంపై మాట తప్పి మహిళల మాంగళ్యాలను తెంచుతున్నందుకేనా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 7) జలయజ్ఞం:కృష్ణా గోదావరి జలాలపై హక్కుల్ని కేంద్రానికి, తుంగబద్రపై హక్కుల్ని కర్ణాటక రాష్ట్రానికి తాకట్టు పెట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును దెబ్బతీసి నదుల అనుసంధానానికి గండికొట్టారు. రాష్ట్రాన్ని కరవు (Drought in AP) రక్కసికి బలిపెట్టారు. ఈ ఏడాది 34 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయేలా చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 8) ఆరోగ్యశ్రీ: 1400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసేందుకు నెట్ వర్క్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. 104, 108 అంబులెన్సులు అక్కరకు రాని చుట్టాలైనందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 9) ఆసరా: ఆసరా కింద మొండి బకాయిలున్న 25% మందికే లబ్ధి. సకాలం 75% మందికి జగన్ రెడ్డి టోకరా వేశాడు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా రుణమాఫీ, పసుపుకుంకుమ ద్వారా ఒక్కో మహిళకు రూ.20 వేల వరకు లబ్ది పొందారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చి ఉంటే రూ. 1.80 లక్షల చొప్పున లబ్ది కలిగేది. హామీకి తిలోదకాలిచ్చి రూ.75వేలు అంటూ ఒక్కో మహిళకు రూ. 1.05 లక్షలు ఎగ్గొట్టినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 10) ల్యాండ్, శాండ్, మైన్, డ్రగ్స్, వైన్, గంజాయి, ఎర్రచందనం దోపిడీ చేసి 3.5 లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి.. పేదవాడికి పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమే అంటున్న మీరు.. దేశంలోని ముఖ్యమంత్రులు అందరికంటే ధనవంతుడైనందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?

Purandeswari Comments on AP Liquor Policy : 'మద్య నిషేధం హామీ ఏమైంది..? లిక్కర్ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి'

  • 11) ప్రశ్నించిన పౌరులు, మీడియా, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, జైలు నిర్బంధాలు, హత్యలు, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టెర్రరిస్టు పాలన చేస్తూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా చేసి.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 12) రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ ద్వారా చంద్రబాబు గారి పాలనలో ఒక్కో రైతు రూ.1,15,000 లబ్ది పొందగా, వీటిని రద్దు చేసి రైతు భరోసా పేరుతో రూ.37,500 ఇచ్చి దగా చేసినందుకా.. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో వుంది. ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు వున్నట్లు జాతీయ గణాంక సర్వేలో ఏపీను మొదటి స్థానంలో నిలిపినందుకా.. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందని ఎన్​సీఆర్​పీ రిపోర్టులో తేలినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 13) ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల పాలనలో ఒక్కో కుటుంబంపై రూ.8,25,549/- అదనపు భారం మోపినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 14) ఉచిత ఇసుక విధానం రద్దు చేసి, 4 రెట్లు ఇసుక రేట్లను పెంచి, భవన నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చి 125 వృత్తులు, వ్యాపారాల్ని దెబ్బతీశారు. 30 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని పోగొట్టినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 15) ప్రత్యేక హోదాను.. విశాఖ రైల్వే జోన్ ను.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేసులు భయంతో కేంద్ర వద్ద రాష్ట్రాన్నీ తాకట్టు పెట్టినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?

తెనాలిలో అన్న క్యాంటీన్‌కి నిప్పు పెట్టిన దుండగులు

  • 16) అన్న క్యాంటీన్లు, పసుపు-కుంకుమ, నిరుద్యోగభృతి, చంద్రబాబు భీమా, పండుగ కానుకలు లాంటి 120 పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసి పేదోడి పొట్ట కొట్టినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 17) 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, 4 సార్లు ఆర్టీసి చార్జీలు పెంచారు, ప్రతి సంవత్సరం 15% ఆస్థి పన్ను పెంచుకుంటూ పోతూ పేదోడి నడ్డి విరిచినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 18) 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానని మాట తప్పి యువతకు ఉద్యోగ కల్పన చేయకుండా, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండరని నమ్మించి.. ఆశ తో ఎదురు చూపులు చూసి యువత విసిగి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లేలా చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 19) చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థల్ని వెంటాడి వేధించి రాష్ట్రం నుంచి తరిమేసి మీ రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?
  • 20) తన దోపిడీని ఎదుటి వారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వంద సార్లు చెప్పడం తన నైజంగా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తాను 16 నెలలు జైలులో ఉన్నాడు కాబట్టి.. లేని కేసులో చంద్రబాబుని జైల్లో పెట్టి పైశాచికానందం పొందినందుకా వై ఏపీ నీడ్స్ జగన్..?

ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పడానికి ఇంకా సవాలక్ష కారణాలు ఉన్నాయని.. వైసీపీ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని, ఈ రాష్ట్రానికి అవసరం లేదనడానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలని ప్రశ్నించారు.

ఈ నెల అయినా సకాలంలో జీతాలు పడతాయా..! ఉద్యోగుల్లో టెన్షన్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details