గుంటూరు జిల్లా నరసరావుపేటలో చైనా అధ్యక్షుని దిష్టిబొమ్మను తెలుగుదేశం పార్టీ నేతలు దగ్ధం చేశారు. చైనా దుశ్చర్యలో అమరుడైన సంతోష్ బాబు అమరహే, జై భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. చైనా దొంగ దెబ్బ తీసి భారత సైనికులను పొట్టన పెట్టుకోవడం దారుణమని నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. దురుద్దేశపూరితంగా చైనా భారతదేశంలోని భాగమైన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు కుట్ర పన్నిందన్నారు. సైనికుల త్యాగాలను భారతీయులు ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా చైనాకు గట్టి బుద్ధి చెప్పాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చదలవాడ అరవింద బాబు కోరారు.
చైనా అధ్యక్షుని దిష్టిబొమ్మను దగ్ధం చేసిన తెలుగుదేశం నాయకులు - నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట తెదేపా కార్యాలయం వద్దనున్న ప్రధాన రహదారిపై నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో చైనా అధ్యక్షుని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చైనా అధ్యక్షుని దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నాయకులు