Gudivada Casino issue: గుడివాడ క్యాసినో వ్యవహారంపై.. తెదేపా నేతల ఆలపాటి రాజా, వర్ల రామయ్య మండిపడ్డారు.
సమగ్ర విచారణ జరపాలి
గుడివాడ క్యాసినో వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని.. లేకుంటే న్యాయ పోరాటానికైనా సిద్ధమని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. ఘటనలో రూ.500 కోట్లు మారాయని.. విదేశాల నుంచి ఖరీదైన జూద పరికరాలను తెప్పించారని ఆరోపించారు. అక్కడ ఏమీ జరగకపోతే తమ పార్టీ నాయకులను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.
ఇప్పటివరకు చర్యలెందుకు తీసుకోలేదు
క్యాసినోలో వందల కోట్లు చేతులు మారాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పునరుద్ఘాటించారు. క్యాసినో వ్యవహారంలో ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. క్యాసినో మాఫియా అంతా విజయవాడ వచ్చిందని.. విష సంస్కృతిని తీసుకువచ్చారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఈడీ దర్యాప్తు కూడా జరగాలని డిమాండ్ చేశారు.
క్యాసినో వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలన్న తెదేపా నేతలు ఇదీ చదవండి:
TDP Leaders arrest in Amaravathi : తెదేపా- వైకాపా శ్రేణుల సవాళ్లు...తెలుగు తమ్ముళ్ల అరెస్టులు...