Varla Ramaiah Complaint on YCP MLA: కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‍రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వైసీపీలో చేరాలంటూ హర్షను ప్రతాప్‍కుమార్ రెడ్డి వేధించారని లేఖలో పేర్కొన్నారు. దీంతో మనస్తాపంతో హర్ష పురుగులమందు తాగి ఆత్మహతాయత్నం చేసుకున్నాడని అన్నారు. నెల్లూరు దళితులు నారాయణ, కరుణాకర్, అనుష్కల మరణాలు మరువక ముందే ఇంకో దళితుడి ఆత్మహత్యాయత్నం కలచివేస్తోందన్నారు. ఎమ్మెల్యేతో కుమ్మక్కై హర్షపై తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేపై డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు - ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వర్ల
Varla Ramaiah Complained on YCP MLA: దళిత వ్యక్తి అయిన హర్షను వైసీపీ నాయకులు తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‍రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వర్ల రామయ్య