ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందడం ఘటనపై ఎన్​హెచ్​ఆర్​సీకి తెదేపా ఫిర్యాదు

కేంద్ర మానవ హక్కుల సంఘాన్ని(ఎన్​హెచ్​ఆర్​సీ) తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కలిశారు. అమరావతిలోని మందడంలో నిరసన తెలియజేస్తున్న మహిళలపై పోలీసులు దాడి చేసి గాయపరిచారని ఎన్​హెచ్​ఆర్​సీ ఛైర్మన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

tdp complaint to nhrc on mandadam issue
కనకమేడల

By

Published : Jan 3, 2020, 8:24 PM IST

మీడియాతో ఎంపీ కనకమేడల
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మందడం మహాధర్నాలో నిరసన తెలియజేస్తున్న మహిళల పట్ల పోలీసులు తీరుపై కేంద్ర మానవ హక్కుల సంఘానికి తెదేపా ఫిర్యాదు చేసింది. బాధితులపై చర్యలు తీసుకోవాలని దిల్లీలో ఎన్​హెచ్​ఆర్​సీ ఛైర్మన్‌కు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఫిర్యాదు పత్రం అందజేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు వారిపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు కనకమేడల వెల్లడించారు. దీనికి ఎన్​హెచ్​ఆర్​సీ సానుకూలంగా స్పందించిందని... ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత కథనాలు

మందడంలో ఉద్రిక్తత.. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details