గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘంలో స్వామి వివేకానంద జయంతి వేడుకల సందర్భంగా గురజాల డివిజన్ స్థాయిలో యువజనోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... యువశక్తి భారతదేశానికి కలిసొచ్చే అంశమన్నారు. డివిజన్ స్థాయి ఆటల పోటీల్లో పతకాలు సాధించి పల్నాడుకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. క్రీడలలో ప్రపంచంలోనే భారత దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
మాచర్లలో యువజనోత్సవాలు..ఘనంగా ఆటల పోటీలు - swami vivekananda jayanti celebrations in macharla
స్వామి వివేకానంద జయంతి వేడుకల సందర్భంగా మాచర్ల పురపాలక సంఘంలో గురజాల డివిజన్ స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలను నిర్వహించారు.
'మాచర్లలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు'