పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గటంతో అధికారులు గేట్ల నుంచి నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం జలాశయంలో 45.05 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువ నుంచి 26వేల 388 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఆ నీటితో ప్రాజెక్టుని పూర్తిస్థాయిలో నింపనున్నారు. జలాశయం నిండే వరకూ గేట్లను మూసివేయనున్నారు.
పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేత
పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేశారు. వరద నీటి ప్రవాహం తగ్గటంతో అధికారులు గేట్లు మూసివేశారు.
పులిచింతల ప్రాజెక్టుకు నుంచి నీటి విడుదల నిలిపివేత
ఆ తర్వాత కూడా వరద నీరు వస్తే విద్యుత్ ఉత్పత్తికి కేటాయిస్తారు. ప్రాజెక్టు నిండిన తర్వాత కూడా 20వేల క్యూసెక్కుల వరద ఉంటే అప్పుడు మళ్లీ గేట్లు ఎత్తే అవకాశముంది.
ఇదీ చదవండి: అచ్చెన్న కేసు: అరెస్టు నుంచి బెయిల్ మంజూరు వరకు