ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ విద్యార్థులు జ్ఞానాన్ని స్కైప్​తో సంపాదిస్తున్నారు! - gunturu district ilavaram school Brought pen pal scheeme news

తరగతి గదుల్లో చెప్పే పాఠాలకే పరిమితం కాలేదా విద్యార్థులు. ఉపాధ్యాయుల సహకారం, సాంకేతికత సాయంతో... ఎన్నో భాషలు, ప్రాపంచిక విషయాలూ నేర్చుకుంటున్నారు. ఓ పల్లెటూళ్లోని ప్రభుత్వ పాఠశాల నుంచి విదేశీయులతో అనుసంధానమవుతూ... జ్ఞాన సముపార్జన చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడుందా పాఠశాల..? అక్కడి విద్యార్థులు చేస్తున్నదేంటి..?

students learn other country culture in skype

By

Published : Nov 22, 2019, 4:29 PM IST

ఏ భాషనైనా బాగా నేర్చుకోవాలంటే... తరచూ మాట్లాడటమే ఉత్తమ మార్గమనేది భాషా నిపుణుల అభిప్రాయం. ఇదే సూత్రాన్ని పాటిస్తూ గుంటూరు జిల్లా ఐలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు... ఆంగ్లభాషలో నైపుణ్యం సాధిస్తున్నారు. స్కైప్ ద్వారా విదేశీ ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడుతూ భాషపై పట్టు సాధిస్తున్నారు. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, విద్యావిధానం, ఆహార అలవాట్ల గురించి తెలుసుకుంటున్నారు. ఆసక్తిగా ఉన్నవాటిపై చర్చిస్తూ అవగాహన పెంచుకుంటున్నారు. అలాగే మన భాష, సంస్కృతుల గురించి వారికి తెలియజేస్తున్నారు. ఘనమైన భారతీయ వారసత్వ సంపద, ఇక్కడి చారిత్రక అంశాలను వివరిస్తున్నారు.

ఆ విద్యార్థులు జ్ఞానాన్ని స్కైప్​తో సంపాదిస్తున్నారు!

ఐలవరం పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హరికృష్ణకు... విదేశీ ఉపాధ్యాయులతో పరిచయాలు పెంచుకోవడం, స్కైప్ ద్వారా మాట్లాడటం అలవాటు. ఈ విధానాన్ని విద్యార్థులకూ అలవర్చితే... వారిలో ఆంగ్లభాషా నైపుణ్యం పెరుగుతుందని భావించారు. అలా ఆయన చొరవతో రెండేళ్ల క్రితం 'పెన్ పాల్ స్కీం' ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడి విద్యార్థులు... తరచుగా విదేశీ ఉపాధ్యాయులు, విద్యార్థులతో స్కైప్ ద్వారా అనుసంధానమవుతున్నారు.

పెన్‌పాల్ స్కీం అమలుతో విద్యార్థుల్లో గొప్ప మార్పు కనిపించించిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విదేశీయులతో పోటీగా మన విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడుతుంటే ఆనందంగా ఉందంటున్నారు.
పాఠశాలలో డిజిటల్ విద్యా బోధనా సౌకర్యాలను ఉపయోగించుకుని... చదువుతో పాటు ప్రాపంచిక విషయాలపైనా ఐలవరం విద్యార్థులు అవగాహన పెంచుకుంటున్నారు.

ఇదీ చదవండి: సైబర్ మోసగాళ్లను నమ్మితే... సర్వం సమర్పయామి..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details