ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని.. విద్యార్థిని ఆత్మహత్య - విద్యార్థిని ఆత్మహత్య న్యూస్

తను ప్రేమించిన యువకుడితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని.. ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన గుంటూరు రాజీవ్ గాంధీ నగర్​లో జరిగింది.

stident committed suicide
విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Sep 1, 2020, 8:22 AM IST

ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు రాజీవ్ గాంధీ నగర్​లో జరిగింది. రాజీవ్ గాంధీ నగర్​లో ఉంటున్న విష్ణు ప్రియ పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. తనతో పాటు 10 తరగతి చదువుకున్న మధు నాయక్​ అనే యువకుడు, విష్ణు ప్రియ ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా.. వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపంతో విష్ణు ప్రియ ఇంటిలో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. విష్ణు ప్రియను జీజీహెచ్​కు తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు అరుండల్​పేట పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details