గుంటూరు జిల్లా మంగళగిరిలో నేటి నుంచి కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా 15 రోజులు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నేటి నుంచి సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు మూసివేస్తామని ప్రకటించారు.
ఉదయం 6 గంటల నుంచి 11 వరకే దుకాణాలు తెరచి ఉంటాయని చెప్పారు. కొవిడ్‌కి సంబంధించి మంగళగిరి పరిధిలోని ప్రతి ఇంటి నుంచి సమాచారం సేకరించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.