రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ సర్వేపై సమీక్షించిన సీఎం.. మండలాల వారీగా బృందాలు ఏర్పాటు చేసుకుని 3 విడతల్లో సర్వే చేపట్టాలన్నారు.
వివాదాల పరిష్కారానికి డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్ కోర్టుల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కార్స్ నెట్‌వర్క్ పనితీరును పరిశీలించిన సీఎం... సర్వేకు ఉపయోగించే రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.