ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ఫ్యూను పకడ్బందిగా అమలు చేస్తున్నాం: ఎస్పీ అమ్మిరెడ్డి

గుంటూరు అర్బన్ జిల్లాలో కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మాట్లాడుతున్న ఎస్పీ అమ్మిరెడ్డి
మాట్లాడుతున్న ఎస్పీ అమ్మిరెడ్డి

By

Published : May 19, 2021, 8:02 PM IST

గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. పోలీస్ సంక్షేమ నిధి నుంచి నిర్మిస్తున్న బ్యారెక్ పనులను ఎస్పీ పరిశీలించారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా బాధితులు సైతం అనవసరంగా బయటకు వస్తే వారిని బలవంతంగా అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలిస్తామని హెచ్చరించారు.

అర్బన్ జిల్లా పరిధిలో రోజుకు 150 నుంచి 200 వరకు వాహనాలను జప్తు చేస్తున్నామన్నారు. కొంత మంది ఆకతాయిలు బయటకు వస్తున్నారని.. ఇకపై వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు. వీరిపై అంటువ్యాధుల నిరోధక చట్టం కింద కేసులు పెడతామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 190 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని వారికి మంచి వైద్యం అందజేస్తున్నామన్నారు. ఏ ఆస్పత్రి అయినా అనుమతులు లేకుండా కొవిడ్ చికిత్సలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'ఎన్​ఫీల్డ్'​ బైకుల్లో లోపం- 2.36 లక్షల యూనిట్లు రీకాల్​!

ABOUT THE AUTHOR

...view details