ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీల కష్టం...బూడిదైంది...!

గుంటూరు జిల్లా నగరం అనే గ్రామంలో గ్యాస్​ సిలిండర్​ పేలి 6 ఇళ్లు దగ్ధమయ్యాయి. బాధితులకు తక్షణ సాయంగా 5 వేల రూపాయల నగదు...20 కేజీల బియ్యం ఇస్తున్నట్లు ఎమ్మెర్వో తెలిపారు.

ఆరు ఇళ్లు దగ్ధం... సుమారు 15 లక్షల ఆస్తి నష్టం

By

Published : Aug 25, 2019, 6:09 AM IST

గుంటూరు జిల్లా నగరం గ్రామంలోని ఎస్టీ కాలనీలో సిలిండర్​ పేలి 6 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఒక ఇంట్లో గ్యాస్​ సిలిండర్​ పేలి మంటలు చెలరేగాయి.... క్రమేపి పక్కనే ఉన్న మరో 5 ఇళ్లకు వ్యాపించాయి. అందరూ కూలి పనులకు వెళ్లినందున గమనిచలేక పోయారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితులకు తక్షణ సహాయంగా 5 వేల రూపాయల నగదు ..20 కేజీల బియ్యం,కందిపప్పు ,మంచినూనె అందిస్తున్నట్లు మండల ఎమ్మార్వో జి.శ్రీనివాసరావు తెలిపారు.

ఆరు ఇళ్లు దగ్ధం... సుమారు 15 లక్షల ఆస్తి నష్టం

ABOUT THE AUTHOR

...view details