గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న ఏడుగురు వ్యక్తులు.. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు కరోనా బాధితులకు 14 రోజులుగా చికిత్స అందించామని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
రెండు సార్లు పరీక్షించిన తర్వాత నెగిటివ్ రాగా.. ఏడుగురిని ఆదివారం ఇంటికి పంపినట్టు చెప్పారు. మరో 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని... కుటుంబ సభ్యులతోనూ భౌతిక దూరం పాటించాలని సూచించామన్నారు. వైద్యుల సలహాలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పామని వివరించారు.